టస్కా సభ్యురాలిగా ఒగ్గు లక్ష్మి యాదవ్ నియామకం
వయోవృద్ధుల సంరక్షణకు, తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులకు కౌన్సెలింగ్ నిర్వహణకు బాధ్యతలు రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 24, మన భారత్ ప్రతినిధి: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ (టస్కా) ఎల్లారెడ్డిపేట మండల సభ్యురాలిగా మండల కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు ఒగ్గు లక్ష్మి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు టస్కా జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య లేఖ నంబర్ 55 ద్వారా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వయోవృద్ధుల సంక్షేమం, సంరక్షణ, వారి హక్కుల పరిరక్షణకు...