వైద్యం కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24,
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు బయలుదేరిన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచెత్తింది. నిర్మల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడి చికిత్స పొందుతున్నాడు.
గాదిగూడ మండలం ఝరి గ్రామానికి చెందిన మెస్రం సరస్వతి (21) గత మూడేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిర్మల్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు సరస్వతి, ఆమె తల్లి పారుబాయి అక్కడికక్కడే మృతిచెందారు. సరస్వతి సోదరుడు సోము ప్రమాదంలో గాయపడగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
వైద్యం కోసం బయలుదేరిన సమయంలోనే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఝరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
