manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 11:49 am Editor : user5442714

కొమురం భీం ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

కొమురం భీం ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం పోరాడిన గోండు వీరుడు: డాక్టర్ నరేష్ జాదవ్

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23: ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కోసం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం 125వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. కొమురం భీం నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కులు, స్వేచ్ఛ కోసం ధైర్యంగా పోరాడిన గొప్ప ఆదివాసీ యోధుడని అన్నారు. ఆదివాసీ సమాజానికి “జల్, జంగల్, జమీన్”పై హక్కులు ఉండాలని చాటిచెప్పిన కొమురం భీం పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కొమురం భీం తన జీవితాన్ని అంకితం చేశారని డాక్టర్ నరేష్ జాదవ్ తెలిపారు. అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. కొమురం భీం త్యాగం, ధైర్యం, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు.

ఆదివాసీల అభివృద్ధితో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ నరేష్ జాదవ్ పిలుపునిచ్చారు. కొమురం భీం జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజల ఆత్మగౌరవం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజర్ పాషా, జాదవ్ రాదేశ్యం, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ ఇన్‌చార్జి బెజ్జంకి అనిల్, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్‌చార్జి గౌలి సంజీవ్ కుమార్, ఆదిలాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ దూబే, కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్, రాష్ట్ర ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్, ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సేద్మకి ఆనందరావు, జిల్లా కాంగ్రెస్ ఫ్రాంటల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ డేరా కృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad