మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 22, రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే పత్తిలో తేమ శాతాన్ని కచ్చితంగా నిర్ధారించి, కొనుగోళ్లలో పారదర్శకతను పాటించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వ్యవసాయ విస్తరణ అధికారులకు నూతన పత్తి తేమ పరీక్ష యంత్రాలు (Cotton Moisture Machines) అందజేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి వ్యవసాయ విస్తరణ అధికారులకు మాయిశ్చర్ మిషన్లను అందించారు. రైతులు విక్రయానికి తీసుకొచ్చే పత్తిలో తేమ శాతాన్ని యంత్రాల ద్వారా కచ్చితంగా పరిశీలించి, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలని సూచించారు.
రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర అందేలా కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని చైర్మన్ అధికారులను కోరారు. పత్తిలో తేమ శాతం ఆధారంగా కొనుగోలు ధరకు సంబంధించి రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని, పరీక్షల విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు.
అలాగే మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. తేమ పరీక్ష యంత్రాల వినియోగం ద్వారా పత్తి నాణ్యతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ గజానంద్, మండల వ్యవసాయ అధికారి నగేష్ రెడ్డి, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విట్టల్, ఏఈవోలు శివ చరణ్, వీర, హేమంత్తో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
