manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 2:57 pm Editor : user5442714

వైభవంగా శారదాదేవికి ప్రత్యేక పూజలు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని తన స్వగ్రామమైన రుయ్యాడిలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గురువారం పలు ప్రాంతాల్లో శారదా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాల సంఘం కాలనీ, దండోరా కాలనీ, శివాలయం సమీపంలోని ప్రాంతం, బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల వద్ద పూజలు చేసి శారదా దేవి ఆశీర్వాదం తీసుకున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఆయా కాలనీల్లోని అమ్మవారి ఆలయాలు, పూజా ప్రాంగణాలను సందర్శించిన గోక గణేష్ రెడ్డి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో వార్డు మెంబర్ జువ్వక్ ఉత్తమ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు లోక ప్రవీణ్ రెడ్డి, గ్రామస్తులు గాజుల సాంబశివ్, పుండ్రు లింగారెడ్డి, కమ్మరి చారి, కుమ్మరి సురేష్ (రిటైర్డ్ కండక్టర్), నక్క గంగన్న, బొంకంటి ఆశన్న, కదిరి ఆశన్నతో పాటు పలువురు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పలువురు ఆకాంక్షించారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad