ఆదివాసిల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన ధైర్యశాలి కొమురం భీం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల చీకటి బతుకులను చూసి వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన పోరాట ధైర్యశాలి కొమరం భీం..
మన భారత్ చిట్యాల(జయశంకర్ జిల్లా):మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేంధర్ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పుల్ల మల్లయ్య జన్నే యుగేందర్ కొలిపాక సాంబయ్యలు మాట్లాడుతూ అనాదిగా చీకటి బతుకులు బతుకుతున్న ఆదివాసులను చూసి స్వయం పాలన కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వారి హక్కుల కోసం నిరంతరం పోరాడి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీమన్నారు. ఆదివాసీలకు చెందాల్సిన నీరు భూమి అడవి వారికి చెందాలని ఆనాటి నిజం పాలకులతో వీరోచితంగా పోరాడారన్నారు. స్వేచ్ఛ మానవత్వం సామాజిక న్యాయం కోసం మహిళల ఆత్మగౌరవం కోసం తిరుగుబాటు చేసిన ధైర్యశీలి అన్నారు నిరంకుశత్వానికి దమన నీతికి ఎదురు నిలిచిన గొప్ప వీరుడు కొమరం భీమ్ అని తెలిపారు. ఆయన ఆదివాసీలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు ఆయనను ఆదివాసీలు స్పూర్తిగాతీసుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి రాజేందర్ చిట్యాల మండల సీనియర్ నాయకులు గురుకుంట్ల కిరణ్, గడ్డం సదానందం, రేగొండ మండల నాయకులు కొలీపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
Cell Number : cell_number : 9603952108
User Name : user_name : రాజు శీలపాక
