తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కౌడాల సంతోష్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తాంసి: అక్టోబర్ 22,తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ తాంసి మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామ రామ మందిరంలో గురువారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
కార్యక్రమానికి హాజరైన కౌడాల సంతోష్ స్థానికులతో కలిసి బతుకమ్మ వేడుకలను వీక్షించారు. తెలంగాణ పల్లె జీవన విధానం, ప్రకృతితో మమేకమైన సంప్రదాయాలు, మహిళల సామాజిక భాగస్వామ్యాన్ని బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న బతుకమ్మ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కప్పర్ల రామ మందిరం వద్ద జరిగిన ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, సాంప్రదాయ కార్యక్రమాలతో ప్రాంగణం సందడిగా మారింది.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
