BRS నుంచి తెలంగాణ రక్షణ సేన TRSలోకి పలువురి చేరికలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మన భారత్, తలమడుగు: అక్టోబర్ 22, తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఆదిలాబాద్ టైలర్స్ కాలనీలోని బోథ్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని రాథోడ్ బాపురావు సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.
దేవాపూర్ ప్రాంతానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం ద్వారా తలమడుగు మండలంలో తెలంగాణ రక్షణ సేనకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీకి ప్రజల నుంచి మద్దతు పెంచేందుకు కృషి చేస్తామని నూతనంగా చేరిన కార్యకర్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల కన్వీనర్ నిమ్మల గజానంద్, నాయిని శ్రీనివాస్, దేవుళ్ల స్వామి, దేవుళ్ల రమేష్, ప్రకాష్, నాందేవ్, అశోక్, ప్రశాంత్, సంతోష్, రమేష్, ఎం. అశోక్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
