క్రాంతినగర్‌లో ఘనంగా అమ్మవారి నిమజ్జన ఉత్సవాలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రత్యేక పూజల అనంతరం వైభవంగా నిమజ్జన కార్యక్రమం
మన భారత్, ఆదిలాబాద్: క్రాంతినగర్‌లోని శారదాదేవి దేవి త్రిపుర సుందరి మండపంలో అమ్మవారి నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మండపానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, భక్తుల ప్రార్థనలతో మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం అమ్మవారి నిమజ్జన ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు భక్తిపాటలు, జైకారాల మధ్య ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంతో క్రాంతినగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను, ఐక్యతను పెంపొందించాయని స్థానికులు పేర్కొన్నారు.
