manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 2:07 pm Editor : user5442714

ఎంపీ గోడం నగేష్‌కు దేవాపూర్ బీజేపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు

ఎంపీ గోడం నగేష్‌కు దేవాపూర్ బీజేపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆదిలాబాద్‌లో ఎంపీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 21

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ జన్మదినం సందర్భంగా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేవాపూర్ బీజేపీ నాయకులు ఆదిలాబాద్‌లోని ఎంపీ గోడం నగేష్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎంపీ గోడం నగేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో మరింత కాలం కొనసాగుతూ నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు కోరుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీతో దేవాపూర్ గ్రామానికి సంబంధించిన పలు అంశాలు, పార్టీ కార్యకలాపాలపై నాయకులు చర్చించినట్లు తెలిపారు. కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ కిరణ్, ఆడెపు శ్రీనివాస్, మల్లన్న, రేగుల మోహన్, ఓస రవి తదితర దేవాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad