manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 2:10 pm Editor : user5442714

మద్యం మత్తులో పోలీసులతో దురుసు ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్

మద్యం మత్తులో పోలీసులతో దురుసు ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మోచిగల్లీలో డయల్ 112 ఫిర్యాదుపై వెళ్లిన పోలీసులతో వాగ్వాదం

విధులకు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21,

ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లి ప్రాంతంలో మద్యం సేవించి అల్లరి చేస్తూ విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ న్యూసెన్స్ సృష్టించిన భూపతి వెంకటేష్‌పై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 21న అర్ధరాత్రి సుమారు 1:10 గంటల సమయంలో మోచిగల్లి ప్రాంతంలోని ఓ షాపు వద్ద కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ అల్లరి చేస్తున్నారంటూ డయల్ 112కు ఫిర్యాదు అందింది. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్కడ నలుగురు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అర్ధరాత్రి సమయం కావడంతో షాపు మూసివేసి ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో వారిలో భూపతి వెంకటేష్ పోలీసుల సూచనలను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను పట్టుకుని నెట్టివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో 335 mg/100 ml రీడింగ్ నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారి విధులకు ఆటంకం కలిగించడం, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ సృష్టించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు కూడా అర్ధరాత్రి వేళల్లో మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లు చేయకుండా సహకరించాలని సూచించారు.

ఈ ఘటనకు సంబంధించి ఎస్సై నాగనాథ్‌తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad