manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 12:36 pm Editor : user5442714

కన్యక పరమేశ్వరి ఆలయంలో వేడుకలు..

కన్యక పరమేశ్వరి ఆలయంలో విజయదశమి వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21,

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్‌లో గల శ్రీ కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఆలయానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఆలయ పూజారులు, కమిటీ ప్రతినిధులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించి, విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ రాజేశ్వరి, ఆలయ కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad