ఎస్పీ అఖిల్ మహాజన్‌కు కాంగ్రెస్ నాయకుల దసరా శుభాకాంక్షలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కారం
మన భారత్, తాంసి: అక్టోబర్ 21 దసరా పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించారు. దసరా పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై నాయకులు అభినందనలు తెలిపారు. పండుగ వేళ ప్రజలు ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకునేలా పోలీసు శాఖ అందిస్తున్న భద్రతా ఏర్పాట్లను ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో తాంసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కౌడల సంతోష్, ఆత్మ చైర్మన్ నారాయణ భోజరెడ్డి, గణేష్ రెడ్డి, తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాల ప్రతాప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
