manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:56 am Editor : user5442714

కలెక్టర్ రాజర్షి షాకు జన్మదిన, దసరా శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

కలెక్టర్ రాజర్షి షాకు జన్మదిన, దసరా శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 21, జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్‌కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షాకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో కీలకంగా ముందుకు సాగాలని కోరారు.

జిల్లా పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. పండుగ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుదురుపాక సురేష్‌తో పాటు నాయకులు సురేష్, రాజన్న, భూపెల్లి శ్రీధర్, అలీం, అశోక్, గౌతమ్, వినోద్, లవన్, వీరేందర్, శేఖర్, సూర్య వంశీ, విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad