manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:58 am Editor : user5442714

పోలీస్ స్టేషన్ లో ఘనంగా ఆయుధపూజ..

మన భారత్ చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి జిల్లా):
​విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయుధ పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది.
​ఈ కార్యక్రమంలో చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) వై. సతీష్ ,సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోచంపల్లి సతీష్, సెకండ్ ఎస్ఐ ఓంపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పోలీస్ స్టేషన్‌లోని ఆయుధాలు, అధికారిక రికార్డులు, వాహనాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు.
​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజల రక్షణ కోసం విధులు నిర్వర్తించే సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా విజయాలు సిద్ధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
​ఈ వేడుకలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్టేషన్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక