దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
-మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్..
మొగుళ్ళపల్లి, అక్టోబర్ 19, (మన భారత్):
దసరా పండుగను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల ప్రజలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ సూచించారు. మంగళవారం దసరా వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. గ్రామాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అనవసర గొడవలకు తెరతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు నిర్వహిస్తామని మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని ఎస్ ఐ ముప్పు సురేష్ కోరారు.
Cell Number : cell_number : 9160189521
User Name : user_name : పవన్ కళ్యాణ్
