manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 12:03 pm Editor : user5442714

గండ్రత్ అరుణ్ కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన డీసీసీ అధ్యక్షుడు

మన భారత్, తాంసి: అక్టోబర్ 19, తాంసి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ తండ్రి గండ్రత్ సుదర్శన్ ఇటీవల మృతి చెందడంతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సోమవారం కప్పర్ల గ్రామంలోని అరుణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా డా. నరేష్ జాదవ్ గండ్రత్ సుదర్శన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గండ్రత్ అరుణ్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. సుదర్శన్ మృతికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. అరుణ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ రెడ్డి, డీసీసీ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జి బెజ్జంకి అనీల్ కుమార్, తాంసి ఆత్మ చైర్మన్ కౌడలా నారాయణ, డీసీసీ జనరల్ సెక్రటరీ, డీసీసీ కార్యాలయ ఇన్‌చార్జి గౌలి సంజయ్, తాంసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడలా సంతోష్, భీంపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దండే సుదర్శన్, డీసీసీ సెక్రటరీ రామన్న యాదవ్, గుడిహత్నూర్ మాజీ అధ్యక్షుడు అంకత్ రవి, బోరిగాం మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ రెడ్డి, శామెందర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad