బతుకమ్మ సంబరాల్లో మహిళలతో కలిసి సందడి చేసిన ఎమ్మెల్యే
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ.. కొడిమ్యాలలో అంబరాన్నంటిన వేడుకలు మన భారత్, కొడిమ్యాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ సంబరాలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి శాసనసభ్యులు...