బియ్యం కొరత లేదు.. మధ్యవర్తుల దోపిడీతోనే ధరల మంటలు!
నిల్వలు పుష్కలం.. సామాన్యుడి కంచంలో అన్నం భారం – అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై నిఘా పెంచాలి మన భారత్, ప్రత్యేక కథనం: అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించే భారతదేశంలో ప్రస్తుతం బియ్యం ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది. నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపుతుండగా, బియ్యం ధరలు కూడా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సాధారణ, సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయన్న వార్తలతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....