manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 6:47 pm Editor : user5442714

గొల్లపల్లి రైతుల ఆయకట్టు రోడ్డుకు శాశ్వత పరిష్కారం

బీటీ రోడ్డు, కల్వర్టులు, కాజ్వేల నిర్మాణానికి కేకే మహేందర్‌రెడ్డికి వినతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 18 మన భారత్ ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామం నుంచి అక్కపెళ్లి వైపు వెళ్లే రైతుల ఆయకట్టు రహదారి పూర్తిగా ధ్వంసమై, భారీ గుంతలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలకు వెళ్లే రైతుల వాహనాలతో పాటు వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలకు ఈ రహదారి ఇబ్బందికరంగా మారింది.ఈ నేపథ్యంలో ఆయకట్టు రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని, బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన కల్వర్టులు, కాజ్వేలు ఏర్పాటు చేయాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం ద్వారా కోరారు.

వారి విజ్ఞప్తిపై కేకే మహేందర్‌రెడ్డి వెంటనే స్పందించారు. సంబంధిత మంత్రితో పాటు శాఖ అధికారులతో మాట్లాడి, ఆయకట్టు రహదారి నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రాల రాజిరెడ్డి, సత్యరెడ్డి, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 8341991420

User Name : user_name : Oggu mahesh chandra