ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ: నీలం మధు ముదిరాజ్
మన భారత్, చిట్కుల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం, అస్తిత్వానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. ప్రకృతిని, పూలను దైవస్వరూపంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకు ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్కుల్లోని తన నివాసంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి నీలం కవిత ఏర్పాటు చేసిన బతుకమ్మకు కుటుంబ సభ్యులతో కలిసి...