ఘనంగా బతుకమ్మ సంబరాలు..
మన భారత్ చిట్యాల: చిట్యాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు దుర్గామాత దర్శనం అనంతరం చెరువు వద్ద బతుకమ్మ వేడుకలు.. ఆటపాటలతో సందడి చేసిన మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను చిట్యాల మండల కేంద్రంలోని గ్రామ మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూలను పేర్చి బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మ సంబరాలను జరుపుకోవడంతో గ్రామంలో పండుగ...