manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 2:38 pm Editor : user5442714

సర్పంచ్ కుటుంబానికి ఆడే గజేందర్ పరామర్శ..

తాంసి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ కుటుంబానికి ఆడే గజేందర్ పరామర్శ

మన భారత్, తాంసి: అక్టోబర్ 18: తాంసి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ తండ్రి మృతి పట్ల బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం తాంసిలోని గండ్రత్ అరుణ్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆడే గజేందర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆత్మీయుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడల సంతోష్, తాంసి మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, తాంసి ఉప సర్పంచ్ నర్సింలు, మండల మైనారిటీ చైర్మన్ రజ్జబ్ అలీ, మాజీ సర్పంచ్ గంగారం, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధనుంజయ్ పాల్గొన్నారు.

అలాగే నాయకులు కేమ హనుమండ్లు, శంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ అనుపట్ల సంజీవ్ కుమార్, బోథ్ మాజీ అసెంబ్లీ అధికార ప్రతినిధి యండి సద్దాంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై గండ్రత్ అరుణ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad