manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 2:52 pm Editor : user5442714

టీటీడీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

టీటీడీ కల్యాణ మండపంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ చిత్రు హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

వేడుకల సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను చుట్టూ మహిళలతో కలిసి బోరంచు శ్రీకాంత్ రెడ్డి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ వేడుకల్లో భాగస్వాములయ్యారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి (DHO) సందీప్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రవంతి, జిల్లా వ్యవసాయ అధికారి (DAO) రవీందర్ సింగ్‌తో పాటు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad