కాంగ్రెస్ నేత వినూత్న అభిమానం!
రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 18 మన భారత్ ప్రతినిధి : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోగూరి శ్రీనివాస్ రెడ్డి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆయన, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గతంలో రేవంత్ రెడ్డి.. ఈసారి రాహుల్ గాంధీ!
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంతో బతుకమ్మను అలంకరించి తన అభిమానాన్ని చాటుకున్న గోగూరి శ్రీనివాస్ రెడ్డి, ఈసారి రాహుల్ గాంధీ చిత్రపటంతో బతుకమ్మను రూపొందించారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగలో రాజకీయ నాయకులపై తనకున్న అభిమానాన్ని పూల అలంకరణ ద్వారా వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగకు నాయకులపై ఉన్న అభిమానాన్ని జోడిస్తూ ఆయన చేసిన ఈ ప్రయత్నం గ్రామస్తులు, కాంగ్రెస్ శ్రేణుల దృష్టిని ఆకర్షించింది. పూల బతుకమ్మలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తన అభిమాన నేతపై ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.
Cell Number : cell_number : 8341991420
User Name : user_name : Oggu mahesh chandra
