బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రులు..
రాంపల్లిలో మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు.. శిల్పనగర్లో మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలు మన భారత్, మేడ్చల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. మేడ్చల్ నియోజకవర్గం నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లి, శిల్పనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు....