manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 3:51 am Editor : user5442714

కేసీఆర్ చొరవతో ప్రమీలకు మెరుగైన వైద్యం..

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17,

ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన పులిపాక ప్రమీలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపారని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ పిల్లల వార్డులో జరిగిన ఘటనలో ప్రమాదానికి గురైన ప్రమీలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

ప్రమీల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న కేసీఆర్ స్పందించి, ఆమెకు మెరుగైన వైద్యం అందేలా నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్యే సంజయ్ నిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, ప్రమీల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యులతో చర్చించారు.

కోలుకున్న ప్రమీలకు పరామర్శ

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న ప్రమీలను మాజీ మంత్రి జోగు రామన్న ఖానాపూర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రమీల త్వరగా కోలుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ప్రమీల చాకచక్యాన్ని అభినందించిన జోగు రామన్న

రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో పిల్లల సంరక్షణకు సంబంధించి ప్రమీల చూపిన చాకచక్యాన్ని ఈ సందర్భంగా జోగు రామన్న అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆమె వ్యవహరించిన తీరును ప్రశంసించారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, చందాల రాజన్న, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, అయూబ్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad