కేలాపూర్ జగదంబ మాత ఆలయానికి భక్తుల పాదయాత్ర
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహణ.. ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 17, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు శనివారం సాయంత్రం భక్తుల పాదయాత్ర భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. శ్రీ జగదంబ మాత మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆదిలాబాద్లోని రాణి సతిజీ మందిర్ వద్ద పాదయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి హారతులు సమర్పించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం జై మాతాది, జై భవానీ నినాదాల మధ్య ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాదయాత్రను ప్రారంభించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా పాదయాత్రలో ముందుకు సాగారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేలాపూర్ జగదంబ మాత ఆలయానికి పాదయాత్రగా వెళ్లడం భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. శ్రీ జగదంబ మాత మండలి ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాలుగా కేలాపూర్ జగదంబ మాత ఆలయానికి పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో కొనసాగుతున్న ఈ సంప్రదాయం ప్రతి ఏడాది మరింత ఉత్సాహంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. జగదంబ మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
పాదయాత్ర సందర్భంగా భక్తులు జై భవానీ, జై మాతాది అంటూ నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. పాదయాత్రలో మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో పాటు జగదంబ మాత మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
