manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 2:31 pm Editor : user5442714

ప్రతి చిన్నారికి పౌష్టికాహారం.. అంగన్వాడీ కేంద్రం

మన భారత్, చిట్యాల ,భూపాలపల్లి జిల్లా:

చిన్నారుల బాల్యం అంగన్వాడీ కేంద్రాల్లో బలోపేతం అవుతుందని, ప్రతి చిన్నారికి పోషకాహారం అందించి ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దాలని శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థానికంగా సహజంగా లభించే పోషక విలువలున్న ఆహార పదార్థాల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంగన్వాడీ, గ్రామపంచాయతీ, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు కార్యక్రమంలో వివరించారు.
అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు విద్యాబోధనతో పాటు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.
జిల్లాలో సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి, అవసరమైన చోట స్థలాలు కేటాయించి, ప్రభుత్వ నిధులతో నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోరారు. అనంతరం పోషణ ఛాంపియన్ ప్రశంషా పాత్రలను అందచేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ అధికారులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక