ముళ్ల పొదలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ముళ్ల పొదలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పొదలు తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: అక్టోబర్ 16, తలమడుగు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో పెరిగిన పొదల కారణంగా విద్యుత్ తీగలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా గాలి వీచిన సమయంలో ముళ్ల కొమ్మలు తీగలకు...