పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి స్థాయికి..
ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి నేడు విద్యార్థులే దేశ భవిష్యత్తు.. యువత కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి మన భారత్, న్యూఢిల్లీ: భారతదేశాన్ని విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు విశేష కృషి చేసిన మహనీయుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నిరాడంబర జీవనం, ఉన్నతమైన ఆలోచనలు, దేశాభివృద్ధిపై అచంచలమైన నిబద్ధతతో కోట్లాది మంది హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అక్టోబర్ 15న ఆయన జయంతి...