manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:28 am Editor : user5442714

భూసేకరణ గ్రామసభకు రైతుల డుమ్మా.!

మన భారత్ , దోమ: ఇండస్ట్రియల్‌ పార్కు కోసం భూములు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం దోమ మండలం భట్లచందారం గ్రామంలో తహసీల్దార్‌ రవీందర్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఒక్క రైతు కూడా హాజరుకాలేదు. జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటచారి సైతం సమావేశానికి హాజరయ్యారు.

98 మంది రైతులకు చెందిన 248 ఎకరాలు

గ్రామంలో 98 మంది రైతులకు చెందిన 248 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్‌ పార్కు కోసం సేకరించాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు ఎంజాయ్‌మెంట్‌ సర్వే నిర్వహించినా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. భూములే తమ జీవనాధారమని, వాటిని కోల్పోతే కుటుంబాలను పోషించుకోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణపై పునరాలోచించి ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలని కోరుతున్నారు. రైతులు హాజరుకాకపోవడంతో అధికారులు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అంశంపై చర్చించి వెనుదిరిగారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Cell Number : cell_number : 9000706559

User Name : user_name : Giri