మన భారత్ దోమ: మండల కేంద్రం నుంచి పాలేపల్లికి వెళ్లే మార్గంలో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ వైర్లకు బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మంటలు రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు, రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.విద్యుత్ వైర్లకు మంటలు రావడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైతులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్, వైర్లను తనిఖీ చేయాలని రైతులు కోరుతున్నారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
Cell Number : cell_number : 9000706559
User Name : user_name : Giri
