manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:38 am Editor : user5442714

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి :ఎంపీడీవో గ్యామా

మన భారత్ దోమ:

గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఎంపీడీఓ గ్యామా అధికారులకు సూచించారు. బుధవారం దోమ మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు.వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీబిజి రాంజీ, స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం), జలసిరి పనులు, ఎల్‌నినో ప్రభావ నివారణ చర్యలు, గృహ నిర్మాణ పథకం తదితర అంశాలపై చర్చించామన్నారు. ఆయా పనుల ప్రస్తుత స్థితిగతులు, పురోగతి, పెండింగ్‌ పనులతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.అభివృద్ధి పనుల్లో జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంచార్జి ఎంపీఓ వెంకటరమణ, ఏపీఓ నర్సిములు, ఏఈ (హౌసింగ్‌) నవీన్, ఈసీ వీరబాబు, టీఏలు, ఆయా గ్రామాల ఎఫ్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

Cell Number : cell_number : 9000706559

User Name : user_name : Giri