పట్టభద్రుల ఓటర్లను చైతన్యపరచాలి..
మన భారత్ కుల్కచర్ల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లను చైతన్యపరచాలని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కో-కన్వీనర్ రాచ శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. కుల్కచర్ల మండల కేంద్రంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాల నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా కన్వీనర్ విజయభాస్కర్రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఘనపూర్ వెంకటయ్య, రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటర్లను కలిసి ఎన్నికల...