manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:18 am Editor : user5442714

బొంపల్లిలో భక్తిశ్రద్ధలతో దేవి నవరాత్రి ఉత్సవాలు

మన భారత్ దోమ: మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారిని కూష్మాండ దేవి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన చాకలి భాస్కర్‌ దంపతులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రి ఉత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సృష్టికి వెలుగును ప్రసాదించిన ఆదిశక్తి స్వరూపంగా కూష్మాండ దేవిని భక్తులు కొలుస్తారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Cell Number : cell_number : 9000706559

User Name : user_name : Giri