ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ
మన భారత్, ఇంద్రవెల్లి: అక్టోబర్ 14,ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల మృతి చెందిన మెండపల్లి గ్రామానికి చెందిన కాశీరాం కుమారుడు రిట్టె భవన్ కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మేస్రం దయాకర్తో కలిసి ఆయన మెండపల్లి గ్రామంలోని బాధిత కుటుంబం వద్దకు వెళ్లారు.
ఈ సందర్భంగా రిట్టె భవన్ కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో మనోధైర్యం ఎంతో అవసరమని రాథోడ్ బాపురావు పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి తమ వంతు అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించడం, వారికి ధైర్యం చెప్పడం, అవసరమైన సమయంలో అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని నాయకులు తెలిపారు.
రిట్టె భవన్ మృతి పట్ల రాథోడ్ బాపురావు, మేస్రం దయాకర్ సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
