manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 2:09 am Editor : user5442714

మార్కెట్ కమిటీ ఆఫీస్ ను సందర్శించిన ఆర్‌డీడీ

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్‌డీడీ మార్కెటింగ్ పద్మావతి

ఆర్‌డీడీకి ఘన స్వాగతం పలికి సన్మానించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 14

వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ (RDDM) పద్మావతి బుధవారం ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆమెకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలోని మార్కెటింగ్ కార్యకలాపాలు, రైతులకు అందుతున్న సేవలు, మార్కెట్‌యార్డులో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులు చర్చించినట్లు తెలిపారు. మార్కెట్ వ్యవస్థ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి (DMO) గజానంద్, మార్కెట్ గ్రేడ్–2 అధికారి విట్టల్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad