manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 5:17 am Editor : user5442714

సిరికొండ జన్మదిన వేడుకలు..

చిట్యాల లో ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు
… నినాదాలతో మారు మ్రోగిన చౌరస్తా ప్రాంతం..
…. ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ..

మన భారత్, చిట్యాల: తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాలలో మధుసూదనాచారి జన్మదిన వేడుకలు నిర్వహించిన అనంతరం టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రం చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మధుసూదనాచారికి శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఉన్నత పదవులతో ఎదుగుతూ జీవించాలని ప్రార్థిస్తూ టపాసులు పేల్చి నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమేష్ ముదిరాజ్ తో పాటు మండల యూత్ కమిటీ మాజీ అధ్యక్షుడు జన్నె యుగంధర్ లు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కేవలం సిరికొండ మధుసూదనాచారితో మాత్రమే సాధ్యమైంది అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రానికి చేస్తూ ఎనిమిది కిలోమీటర్ల పాటు సెంటర్ లైటింగ్ సిస్టమును ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని వారు తెలిపారు చిట్యాల లో 50 పడకల ఆసుపత్రి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఆయన కృషి మూలంగానే వచ్చాయని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పూర్తిచేసి అద్భుతమైన అభివృద్ధిని సాధించారని కొనియాడారు. కొన్ని కారణాల మూలంగా ఓటమిపాలైన భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం నేటికీ ఆయన కృషి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నెబోయిన అశోక్ కొత్త శ్రీను జెంబుల చంద్రమౌళి సంగ రాజేందర్ ఎండి శంషుద్దీన్ ఎజ్జిగిరి ఆనందం గురుకుంట్ల కిరణ్ ఉప్పుల కిరణ్ రాయని శ్రీకాంత్ నల్ల నవీన్ తీగల బాలకృష్ణ ఆనందా చారి మోతుకూరి సంతోష్ వేముల హరీష్ భయగాని గణపతి బొట్ల రవీ బొంకూరి సమ్మయ్య కార్ట్రేవుల రాజయ్య ఆర్.ఎం.పి భాస్కర్ నేరెళ్ల ఓదెలు మందల రాజేష్ బండి తిరుపతి గుర్రం విజేందర్ కోడెల రాజమల్లు గుర్రం సుశ్రిత్ రాజు నాయక్ మల్లయ్య ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక