మన భారత్, దోమ: రైతులు వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకొని, సాగులో మంచి దిగుబడులు సాధించాలని పీఏసీఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శాంతి కుమార్ సూచించారు. మంగళవారం దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9000706559
User Name : user_name : Giri
