manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 1:35 pm Editor : user5442714

పోలీసులపై దాడి కేసులో 20 మంది అరెస్ట్

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి.. ఐదుగురికి గాయాలు

ప్రభుత్వ పోలీసు వాహనం, ఫోన్లు ధ్వంసం.. మరికొందరి పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసి, వారిని నిర్బంధించి, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మొత్తం 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు. సోమవారం ఏడుగురిని, మంగళవారం మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దాడులకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

గంజాయి కేసు దర్యాప్తు సందర్భంగా ఘటన

సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాయిపేట్ గ్రామంలో అక్టోబర్ 10వ తేదీ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సిరికొండ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 90/2026, ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదైన గంజాయి కేసు దర్యాప్తులో భాగంగా ఇచోడా సీఐ సీహెచ్. రమేష్, కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రభుత్వ వాహనంలో బంగారుపేట గ్రామానికి వెళ్లారు.

గంజాయి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో పాటు సిబ్బందిపై కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని బలవంతంగా సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడించారు.

ఐదుగురు పోలీసులకు గాయాలు

ఈ దాడిలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఎడమ చేతికి ఎముక విరిగింది. ఇచోడా సీఐ సీహెచ్. రమేష్ భుజం, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. ఏఎస్ఐ రాథోడ్ బలిరామ్ ఎడమ చేయి, తొడ, భుజానికి గాయాలయ్యాయి. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ భీంరావుకు కుడి చేయి, నడుము భాగాల్లో గాయాలు కాగా, ఏఆర్ కానిస్టేబుల్ గంగారాంకు తలపై రక్తస్రావ గాయమైంది.

దాడి సమయంలో పోలీసులను చంపుతామని బెదిరించడంతో పాటు ప్రభుత్వ పోలీసు వాహనాన్ని, ప్రభుత్వ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో సెల్‌ఫోన్‌తో పాటు క్రైమ్ నంబర్ 79/2026కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లలో భాగమైన సీడీ ఫైల్‌ను అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు.

వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు

కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 92/2026 కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 109, 303(2), 137, 121, 140, 191తో పాటు 190 సెక్షన్, ప్రభుత్వ ఆస్తుల నష్టం నివారణ చట్టం (PDPP Act) సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును ఇచోడా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

రెండు విడతల్లో 20 మంది అరెస్ట్

ఈ కేసులో మొదటి విడతగా A1 నుంచి A7 వరకు ఏడుగురు నిందితులను అక్టోబర్ 12న అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రెండో విడతగా A8 నుంచి A20 వరకు మరో 13 మందిని అక్టోబర్ 13న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:

1. చిక్రం రాము (38) – సర్పంచ్
2. పెందూర్ బాదు పటేల్ అలియాస్ పెందూర్ బదిరావు (33) – పటేల్
3. పెందూర్ మారుతి (38) – మాజీ ఎంపీటీసీ
4. చాకటి ఇంద్రకాంత్ (28)
5. సెడ్మాకే భీంరావు (27)
6. పెందూర్ అరుణ్ కుమార్ (32)
7. పెందోర్ శ్రీరామ్ (32)
8. పెందోర్ జ్యోతిరామ్ (59)
9. కినక భీంరావు (64)
10. పెందూర్ మహేశ్వర్ (35)
11. మడావి కృష్ణ (26)
12. పెందూర్ రవి (26)
13. పోయం తిరుపతి (18)
14. ఆత్రం జల్పతిరావు (55)
15. పెందూర్ మనోహర్ (45)
16. సిదం నరేష్ (21)
17. గడ్డం విజయ్ కుమార్ (25)
18. చేదం శ్రీనివాస్ (31)
19. పెందోర్ సోము (37)
20. పోయం గంగారాం (37)

వీరంతా సిరికొండ మండలంలోని వాయిపేట్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు పేర్కొన్నారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

ఈ ఘటనలో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. దాడికి పాల్పడినట్లు తేలిన ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలను ఉపేక్షించబోమన్నారు.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad