కేలాపూర్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు
మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 13 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ అమ్మవారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ దేశ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కేలాపూర్ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. ఈ పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం భక్తుల ఆచారంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
Cell Number : cell_number : 9573391945
User Name : user_name : Gontimukkula prasad
