బతుకమ్మ విగ్రహ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సర్పంచ్ చాట్ల విజయ
మొగుళ్ళపల్లి, అక్టోబర్ 13, (మన భారత్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి-ముల్కలపల్లి గ్రామాల మధ్యన గల శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవస్థాన ప్రాంగాణంలో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో..ఉత్సాహంగా, ఆటపాటలతో ఆడుకునే సద్దుల బతుకమ్మ వేడుకలలో భాగంగా..మొగుళ్లపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ కోరిక మేరకు నూతనంగా బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సర్పంచ్ చాట్ల విజయ విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా పంచాయతీ సిబ్బందిచే గ్రామంలోని వీధులను, ముఖ్య కూడళ్లను శుభ్రం చేయిస్తూ..రోడ్లకు ఇరువైపులా ఉన్న ముండ్ల పొదలను తొలగిస్తూ..గ్రామంలో వెలుగులు విరజిమ్మేలా వాడ వాడల వీధిలైట్లను ఏర్పాటు చేస్తూ..ఆడపడుచులు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మను నిర్వహించుకునేలా కృషి చేస్తున్నారు. కాగా సర్పంచ్ చాట్ల విజయ కృషిని ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు.
Cell Number : cell_number : 9160189521
User Name : user_name : పవన్ కల్యాణ్
