manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 9:33 am Editor : user5442714

ఘనంగా సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు..

మొగుళ్ళపల్లి లో ఘనంగా సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 13,(మన భారత్):

మంగళవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ నాయకులు మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చదువు అన్నారెడ్డి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చదువు అన్నారెడ్డి మాట్లాడారు.మారుమూల ప్రాంతమైన భూపాలపల్లికి..జయశంకర్ పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా నామకరణం చేసి, నూతన జిల్లాకు జీవం పోసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మాజీ మండల ఉపాధ్యక్షుడు దానవేణి రాములు,బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సలాలి సమాధానం, బీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రమేష్, అరికాంతపు అన్నారెడ్డి, కక్కెర్ల ప్రశాంత్ గౌడ్, రాస ప్రశాంత్ తదితరులు, పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9160189521

User Name : user_name : పవన్ కళ్యాణ్