– నీలాస్ ట్రస్ట్ చైర్మన్ నీల రాజు కురుమ
మొగుళ్ళపల్లి, అక్టోబర్ 12, (మన భారత్):
క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని
నీలాస్ ట్రస్ట్ చైర్మన్ నీల రాజు కురుమ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో నీలాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ను చిట్యాల సిఐ వై సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల ఎండీ రఫీ మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీల రాజు కురుమ మాట్లాడుతూక్రీడలు నేటి స మాజంలోని యువతకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతోపాటు స్నేహ సంబంధాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
