manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:46 pm Editor : Editor Vishal Kumar

టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు..

గేర్జంలో తెలంగాణ రక్షణ సేనలోకి పలువురు చేరికలు

కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

మన భారత్, ఇచ్చోడ: అక్టోబర్ 12, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండలం గేర్జం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన క్యాంపు కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో వివిధ ప్రాంతాలకు చెందిన వారు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

పేద, బలహీన వర్గాలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేయడం పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గేర్జం గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరడం ద్వారా గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాథోడ్ బాపురావును శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.