manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:36 pm Editor : Editor Vishal Kumar

పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి: బోరంచు శ్రీకాంత్ రెడ్డి

బట్టిసావర్గంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏర్పాటు..

పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి: బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మావల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు

మన భారత్, మావల: అక్టోబర్ 12, ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశమై నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నాయకులు, కార్యకర్తలు చర్చించారు.

గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. నూతనంగా నియమితులైన గ్రామ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో, ఐక్యంగా సైనికుల్లా పనిచేయాలని పేర్కొన్నారు.

గ్రామంలో ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో బట్టిసావర్గం గ్రామ సర్పంచ్ మేడిపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల గణపతి రెడ్డి, బర్రె వెంకట్ రెడ్డి, తడిసేన వెంకట్ రెడ్డి, అన్నం సంటెన్న, కొరటి ప్రభాకర్, దర్శనాల ఏవన్, అగ్గు రాజన్న, దొంతుల వెంకటేష్, దొంతుల పురుషోత్తం, ఆశాబాయి, ప్రేమల, సంగీత తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.