manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 12:52 pm Editor : Editor Vishal Kumar

అభివృద్దే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: బోరంచు శ్రీకాంత్ రెడ్డి

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: బోరంచు శ్రీకాంత్ రెడ్డ

తాంసి, బండల్ నాగపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

మన భారత్, తాంసి: అక్టోబర్ 12, తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తాంసి మండల కేంద్రంతో పాటు బండల్ నాగపూర్ గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి లబ్ధిదారులకు సంబంధిత పట్టాలు, చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని అన్నారు. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్లను నిర్మించి అందించడం ద్వారా వారి చిరకాల స్వప్నాన్ని నిజం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లను అందించే కార్యక్రమాలను చేపడుతూ, లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించడంతో పాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భాగమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, బండల్ నాగపూర్ సర్పంచ్ పుష్ప, హౌసింగ్ ఏఈ నషీర్, హౌసింగ్ డీఈ రమేష్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తాంసి తహసీల్దార్ మధుసూదన్, తలమడుగు తహసీల్దార్ రాజేష్ మోహన్, మార్కెట్ కమిటీ సభ్యుడు ధనుంజయ్, గ్రామస్తులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.