ఎస్జీఎఫ్ అండర్-17 జట్టుకు బుగ్గారం(బి) విద్యార్థి ఎంపిక
పేద రైతు బిడ్డకు క్రీడల్లో అరుదైన అవకాశం.. విద్యావర్ధన్కు అభినందనల వెల్లువ నేరడిగొండ, మన భారత్: పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నేరడిగొండ మండలంలోని బుగ్గారం(బి) గ్రామానికి చెందిన విద్యార్థి గజ్జల విద్యావర్ధన్ నిరూపించాడు. పేద రైతు కుటుంబంలో జన్మించి, అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ క్రీడల్లో తన ప్రతిభను చాటుకున్న విద్యావర్ధన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-17 విభాగానికి ఎంపికై గ్రామానికి...