సాంబమూర్తి దేవాలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన
మొగుళ్ళపల్లి, అక్టోబర్ 11, (మన భారత్):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ఆదివారం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు భైరవపట్ల వెంకటేశ్వర శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విగ్రహ దాతగా గుర్రపు అన్నారెడ్డి రెండవ కుమారుడు గుర్రపు దినేష్ రెడ్డి_ మౌనిక సహకారం అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.శరన్నవరాత్రుల మొదటి రోజున అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా గ్రామ సర్పంచ్ చాట్ల విజయ, ఉప సర్పంచ్ హిమాబిందు, వార్డు సభ్యులు,భజన మండలి సభ్యులు, కంకణదారులు మహిళలు , యువకులు, గ్రామ ప్రజలు , భక్తితో పాల్గొన్నారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
